అభ్యర్థన

ధర్మస్య హ్యాపవర్గస్య నార్థో అర్థాయెహ కల్పతే ।
నార్థస్య ధర్మైకాన్తస్యస కామో లాభయ హి స్మృతః ।।

అను భాగవతధర్మమునకు అనుగుణంగా మనము తెలుసుకొని ఆచరించవలసిన తత్వము ఏమనగా, ధర్మము అంటే సత్కర్మములచే సంప్రాప్తించిన పుణ్యము ఇదియే మనులను సుఖముగా ఉండుటకు వీలుచేయును, ఇట్టి ధర్మము ఉంటేనె ధనప్రాప్తి కలుగును, ధనము మనకు సుఖముగా ఉండుటకు సహకరించును, కావున ధనము ధర్మముచే లభించును, కామభోగములు ధనము చే లభించును ఇది లోకరీతి, కాని భాగవతము దీనిని అంగీకరించదు. భాగవతము మనకు ఉపదేశించునది ఏమనగా, ధర్మమే (పుణ్యమే) మనకు సంపదను కలుగజేయును కాని ఆ ధనసంపద కేవలము సుఖభోగమునకే కాదు సుఖభోగము మరియు ధర్మార్జనకు కూడా ఉపయుక్తము కావలె, లేని యడల సంపాదించిన ధర్మము ఖర్చు అయినచో ముందు మనకు సుఖము కలుగదు.
ఇట్టి అవస్థలో ధర్మార్జన మనకు అనివార్యము, తప్పనిసరి కర్తవ్యము. ఈ ధర్మార్జన రెండు విధములలో మనము సంపాదించగలము, ఒకటి స్వయముగా ధర్మమును ఆచరించుట రెండవది ఆచరించువారికి యథాశక్తి సహాయ పడుట, మహాభారతము మనులకు ఆదేశించునది ఇదియే, మనము న్యాయబద్ధముగా ఆర్జించిన ధనమును 5 భాగములు చేసి, ఒక భాగము మన సుఖభోగములకు, రెండవ భాగము మనులను ఆశ్రయించిన సతిసుతులకు, 3భాగము భవిష్యత్తు కొరకు, 4 భాగము పెట్టుబడుల కొరకు అయితే చివరి 5 భాగము ధర్మార్జన కొరకని ఆదేశించుచున్నది.
“దానం ధ్రువం ఫలతి పాత్రగుణానుకూల్యాత్” అను ఋషివచనము మనులకు సత్పాత్ర దానము చేయవలెనని, సత్కార్యములను చేయడము లేదా సహాయపడడము అని తెలియ జేయుచున్నది, సత్కార్యములలో జ్ఞానప్రచారము కన్న మించిన సత్కార్యము లేదు, అన్ని సత్కర్మముల చివరికి సంగమించునది జ్ఞానమునే, “సర్వ కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతె” అను గీతాచార్యుని (శ్రీ కృష్ణుని) వచనము తెలియ జేయుచున్నది, కావున దేశ విదేశాలలో ఉన్న మన తెలుగువారికి నిస్వార్థంగా అంతర్జాలము (internet) ద్వారా అందజేయు ఈ బృహత్ జ్ఞానయజ్ఞానికి మీరందరు ఆర్థిక,కాయిక, వాచికంగా సహాయపడవలసినదిగా మిమ్ములను అభ్యర్థించుచున్నాము.

ఇట్లు
శ్రీ లక్ష్మీ నరసింహాచార్య సుళిభావి వారి శిష్యగణము
HELP LIBERALLY FOR THE DEVELOPMENT OF THE TELUGU DIVINE LECTURES  WEBSITE “narasimhacharyasulibhavi.org

SRI 1008 SRI SATYATMA TIRTHA DASA

NARASIMHACHARYA SULIBHAVI,

SBM SB ACCOUNT NO- 64039546200

BENEFICIARY- HARINI N SULIBHAVI & NARASIMHACHARYA SULIBHAVI

IFSC CODE- SBMY0040949
MOB-7396765108

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>