నల్లని నువ్వులు

శ్రాద్ధానికి నల్లని నువ్వులుసరియు దర్భములను తప్పనిసరిగా ఎందుకు వాడతారు?

ఈ ప్రశ్న చాలామందికి వచ్చి ఉండోచ్చుఅలాగె చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండోచ్చురెండవ క్రోవకి చెందిన వారిని మనము పట్టించుకోకుండా ఉండడమే మేలు. “శ్రాద్ధము” అనే శబ్దములోనె శ్రద్ధతో చేయవలసినది (యత్ శ్రద్ధయా క్రీయతె తత్ శ్రాద్ధం), కాని నేటి సమాజములో చాలామందికి శ్రద్ధ లేదుఏదో మొక్కుబడిగా ముగించాము అని అనిపించుతారె తప్ప ఏమి చేసాముఎందుకు చేసాము అనేదె తెలియదు.

జన్మదాతల ఋణము శరీరము చనిపోయేంతవరకు ఉంటుందికాబట్టే మన తల్లిదండ్రులు చనిపోయాక కూడావారి పాంచభౌతిక శరీరము నశించినా వారి ఋణమును తీర్చుకొనుటకు మనము వారి తదనంతరము మరియు మనము జీవించి ఉన్నంతవరకు వారి కోసము శ్రాద్ధ తర్పణాదులు చేయవలసినదే!.

ఈ శ్రాద్ధ తర్పణాదులు అనగా మనకు గుర్తు వచ్చేదె నల్ల నువ్వులు మరియు దర్భములుఈ రెండు మనము శ్రాద్ధాని కార్యాలలో ఎందుకు వాడాలి అన్నదానికి కొన్ని సమాధానములు ఇచ్చట ప్రస్తావించుచున్నాను.

గరుడునికి శ్రీ మహావిష్ణువు ఇలా ఉపదేశించారు.

మ స్వేదసముద్భూతాః తిలాః తార్క్ష్య పవిత్రకాః అసురాః దానవా దైత్యా విద్రవన్తి తిలైస్తథా ||

తిలాః శ్వేతాః తిలాః కృష్ణాః తిలాః గోమూత్ర సన్నిభాః దహన్తు తే మే పాపాని శరీరేణ కృతాని వై ||

ఏకఏవ తిలో దత్తో హేమద్రోణ తిలైః సమః తర్పణె దానహోమేషు దత్తో భవతి అక్షయః ||

భావమునువ్వులు మూడురకాలు తెలుపునలుపు మరియు గోమూత్రమువలె బంగారు రంగులో ఉండునుఏ రంగు నువ్వులు (తిలము)అయిననుతిలము ఇది చిన్మయుడైన నిర్దోషుడుఅనంత గుణపూర్ణుడు అయిన జగత్స్వామి శ్రమరహితుడు అయిన శ్రీ మన్నారయణుని స్వేదము చే సృష్టించబడినదికావున ఇట్టి తిలములను ఒకటైననూ శ్రాద్ధములో సమర్పితమైననూ బంగారు కుంభంలో నింపిన సువర్ణ తిలములను దానము ఇచ్చినంత పుణ్యముఅక్షయమైన ఫలమును ప్రసాదించునుఅంతే కాకుండ ఎచట తిలములు ఉండునో అచట దైత్యులుపిశాచాలురాక్షసులు మొదలగువారు పారిపోదురుతన్నిమిత్తంగా నిర్విఘ్నముగా చేపట్టిన కార్యము సమాప్తి చెందునుమన శరీరముచే చేసిన పాపములు అన్నియు నశించునుకావున మనము శ్రాద్ధము మొదలగు కర్మముల ఎందు తిలములను వాడుట పరిపాటి,సంప్రదాయము.

ఇక దర్భముల వైశిష్ట్యము తెలుసుకుందాము.

దర్భాః రోమసముద్భూతాః తిలాః స్వేదేషు నాన్యథా దెవతా దానవాః తృప్తాః శ్రాద్ధేన పితరస్తథా ||

ప్రయోగవిధినా బ్రహ్మా విశ్వం చాప్యుప జీవనాత్ అపసవ్యాదితో బ్రహ్మా పితరో దేవదేవతాః ||

తేన తె పితరః తృప్తా అపసవ్యే కృతె సతి దర్భమూలె స్థితో బ్రహ్మా మధ్యే దేవో జనార్ధనః ||

దర్భాగ్రే శఙ్కరం విద్యాత్ త్రయో దేవాః కుశే స్మృతాః విప్రా మన్త్రాః కుశా వహ్నిస్తులసీ చ ఖగేశ్వర ||

నైతె నిర్మాల్యతాం యాన్తి క్రియమాణాః పునఃపునః తులసీ బ్రాహ్మణా గావో విష్ణురేకాదశి ఖగ ||

పఞ్చ ప్రవహణాన్యేవ భవాబ్ధౌ మజ్జతాం నృణామ్ విష్ణురేకాదశీ గీతా తులసీ విప్రధేనవః ||

భావముతిలములు భగవంతుని చిన్మయుడైన నిర్దోషుడుఅనంత గుణపూర్ణుడు అయిన జగత్స్వామి శ్రమరహితుడు అయిన శ్రీ మన్నారయణుని స్వేదము చే సృష్టించబడినదిఅటులనే దర్భములు భగవంతుని రోముమలనుండి సృష్టించబడినవిఇట్టి దర్భములను శ్రాద్ధవిధిలో మంత్ర సహితంగా ఉపయోగించినచో సమగ్ర సజ్జన సముదాయముసమస్త విశ్వముపితృదేవతలుదేవతోత్తములు తృప్తి చెందురు.అపసవ్యమును ఒనర్చినచో ఉపజీవించురు సంతోషించుదురుసంతృప్తి చెందురుకావున మనము శ్రాద్ధము చేయు సందర్భములో మంత్ర మంత్రానికి అపసవ్యము ఒనర్చుదము.

దర్భముయొక్క మూలభాగమున చతుర్ముఖ బ్రహ్మదేవుడుమధ్యభాగములో శ్రీ మన్నారాయణుడుఅగ్రభాగమున రుద్రదేవుడు సన్నిహితులై ఉండురుత్రిమూర్తుల సన్నిధానముతో పవిత్రమైన దర్భము ఉన్నచోట పిశాచములదుష్టశక్తుల పీడ ఉండదుకావున దర్భములు ఉన్నచోట శుభములు కలుగును.

  1. బ్రాహ్మణులుమన్త్రములుదర్భములుఅగ్నితుళసీ వీటికి మైలముఅశుద్ధి మొదలగు దోషములు లేవు.

  2. అలాగే తుళసిబ్రాహ్మణులుగోవులుశ్రీ మహావిష్ణువుఎకాదశి నిర్జల ఉపవాసము ఇవి అయిదు భవసాగరములో మునిగి నశించు మానవమాత్రులకుఒక పడవవలె ఆశ్రయము ఇచ్చి భవసాగరమును దాటించును.

  3. శ్రీ మహావిష్ణువుఎకాదశి ఉపవాసముభగవద్గీతాతుళసిబ్రాహ్మణులుగోమాతలు ఈఆరు మోక్షమును ప్రసాదించును.

  4. అసారమైన అశుద్ధమైన ఈ సంసారములో అత్యంత పవిత్రమైనవి తిలములుదర్భములు మరియు తుళసిమనకు సంభవించు దుర్గతునుండి రక్షించును.

సర్వ పితృంతర్గత భారతీ రమణ శ్రీ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ కృష్ణార్పణమస్తు

SRI 1008 SRI SATYATMA TIRTHA DASA

NARASIMHACHARYA SULIBHAVI,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>