పరశురామ పరబ్రహ్మ మహిమా

శ్రీ గురుభ్యోనమః
శ్రీ పరశురామ పరబ్రహ్మణే నమః
నిర్దోషుడు అనెతగుణ పరిపూర్ణుడైన శ్రీ మహా విష్ణువు అవతారములు అనంతమైనా మనము సులువుగా ఉపాసనము ఆరాధనము చేయుటకు మఖ్యముగా దశావతారములను శాస్త్రము తెలిపుచున్నది, మరొక విశేషము ఏమనగా మనము భగవంతుని దశ అవతారములను స్మరించినా ఉపాసన చేసినా చాలు ఆ దేవదేవుని అనంత అవతారములను స్మరించిన ఉపాసన జేసిన మహా పుణ్యము దొరుకును (ఐతరేయ ఉపనిషత్తు శ్రీ మధ్వభాష్యము).
తంత్రసారములో మనకు జగద్గురువు శ్రీ మన్ మధ్వాచార్యులవారు 72 మహామంత్రములను ఉపదేషించియున్నారు, అట్టి మహామంత్రములలోనూ పరశురామ మంత్రమును ఉద్దేషించి ఇట్టి మంత్రమును ఉపాసన చేసే సజ్జనులకు ఆ పరశురామ పరమాత్మ సకల దిగ్విజయమును, హిరణ్య రత్న రాజ్యములే మొదలగు సకల ఐహిక అభీష్టములు కరుణించునని నిష్కామ భక్తితో ఆరాధించినవారికి మహా మోక్షమునే కరుణించునని సెలవిచ్చారు.
శ్రీ పరశురామ పరబ్రహ్మ తమ తండ్రిగారైన శ్రీ జమదగ్ని ఋషిగారి ఆదేశమును పాటించుటకై ఒక గంధర్వుని చే కించిత్ మానసిక వ్యభిచార దోషముతో దూషితురాలైన తమ తల్లిగారైని రేణుకా దేవిని అడ్డుచెప్పిన తన అన్నలను శిరశ్ఛేదమును గావించి వారి వారి పాతివ్రత్య భంగము, జనకుని ఆజ్ఞా ఉల్లంఘము ననునట్టి దోషములను పరిహరించి, అలాగే తమ తండ్రిగారైన జమదగ్ని ఋషులను మెప్పించి మరల తమచే హతులైన తల్లి మరియు అగ్రజులను మునపటి వలె పునర్జీవితులుగా ఒనర్చి వెనకటి సర్వమానసిక దోషములను పరిహరించినారు. తమచే మృతులైన వారిని పునర్జీవితులుగా జేయు తమ సామార్థ్యము అలాగే తమ తండ్రిగారి సామార్థ్యము విదితమై ఉన్నది గావున అట్టి లోక నిందితమైన క్రూర కర్మను జేసినారు. ఇది అందరికి సమానముకాదు. కేవలము పరమేశ్వరుడైన పరశురాములవారు మాత్రమే చేయగలరు.
అసంప్రజ్ఞ సమాధియందు ఉన్న తమ తండ్రి గారిని దొంగచాటుగా హతమొనర్చిన కార్త్యవీర్యుని 10000 మందికుమారులని అలాగే లోకభారముగా మారిన పాపభూయిష్టులగు నామమాత్రమునకి రాజులై ఉన్న దుష్ట క్షత్రియులనందరి (పోతన భాగవతము, మూల మహాభాగవతము, మహాభారతము) కడతేర్చి వారి రక్తముతో స్యమంతపంచకమనెడి పవిత్ర క్షేత్రములో తొమ్మిది రక్తపు మడుగులను చేసి అచట తన తండ్రిగారి కళేబరమును జోడించి ఆ రక్తపు మడుగులలో పితృతర్పణమును కలుగజేసి మరల తమ తండ్రిగారి పునర్జీవితులుగా గావించి సప్తఋషిమండలములో శాశ్వత స్థానము కలుగజేసినారు.
ఇట్టి మహనీయ గుణార్ణవుడైన పితృవాక్య పరిపాలకుడైన, సజ్జన ప్రపంచమును రక్షించెడి పరశురామ పరమాత్మను గూర్చి సరియైన జ్ఞానములేని కొంతమంది TV (తత్వవిరోధి) ఉపన్యాసకులు పరశురామ అవతారము క్రోధపూర్ణము అనవసరంగా క్రోధముల 21 మార్లు సమగ్ర భూమిని చుట్టి ఈ భూమిని క్షత్రియ రహితముగా చేసినాడు, ఇది వ్యర్థమైన అవతారము ఇవే మొదలగు వ్యర్థమైన తత్వవిరుద్ధమైన మాటలను మిడిమడి జ్ఞానముతో పలుకుతు సజ్జనులని భక్త సమాజమును తప్పు ద్రోవ పట్టించుచున్నారు. ఇట్టి అల్పజ్ఞానులు మూలభాగవతమును, మహాభారతము మొదలగు గ్రంథములను సరియైన రీతిలో తెలుసుకొని తమ తప్పుని సరిదిద్దుకొనెలా ఆ శ్రీ లక్ష్మీనరసింహాభిన్న పరశురామ పరబ్రహ్మయే వారికి సత్ ప్రేరణని కలుగజేయుగాక.
ఇది సంక్షిప్త వివరణ మాత్రమే..
ఇతి
హరివాయుగురువుల దాసుడు
నరసింహాచార్య సుళీభావి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>