పరిచయం

DSC03831

ఏకాదశ స్కంద భాగవతములో సనతకుమారాదులకు , చతుర్ముఖ బ్రహ్మదేవులకు జ్ఞానోపదేశము చేసిన శ్రీ హంసనామక పరమాత్మునిచే స్థాపించబడిన శుద్ధ సనాతన వైదిక సంప్రదాయమున విశ్వానికి జ్ఞానోపదేసమును చేయుచున్న శ్రీ ఉత్తరాదిమఠమును శ్రీ మన్ మధ్వాచార్యులవారు 10-11 వ శతాబ్దములో పునః ప్రతిష్ఠాపనము చేసినారు, అప్పటినుండి శ్రీ మన్ మధ్వాచార్యుల మూల మహా సంస్థానమై లోక ప్రసిద్ధిని గడించిన శ్రీ మద్ ఉత్తరాది మఠమున పీఠాదిపతులై ఎందరో మహానుభావులు దేవతాంశసంభవులు శ్రీ హంసనామక పరమాత్ముని సేవను పలువిధాలుగా చేసిి ఉన్నారు,ఇటువంటి శుద్ధ సనాతన వైదిక సంప్రదాయమైన శ్రీ ద్వైత సిద్ధాంత ప్రతిష్ఠాపకమైన శ్రీ మన్ మధ్వాచార్యుల మూల మహాసమస్థానము అని ప్రసిద్ధి గాంచిన శ్రీ మద్ ఉత్తరాది మఠము ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్ధ శ్రీపాదులవారు. వీరు శ్రీ 1008 శ్రీ సత్యప్రమొద తీర్థ శ్రీ పాదులవారి ప్రియ శిష్యులై వారిచే జ్ఞానమును పీఠాధిపత్యమును (జ్ఞానమును ప్రచారము చేసే బాధ్యతను ) 1995 సంవత్సరమున స్వీకరించినారు, అప్పుడు శ్రీ సత్యాత్మతీర్ధుల వారి వయస్సు 23 సంత్సరములే, ఆ లేత వయస్సులోనే అత్యంత కఠిణమైన పరమ హంస పరివ్రాజక (సంన్యాసములలో అత్యున్నతమైన)ఆశ్రమము స్వీకరించి నిరంతర జ్ఞానోపదేశము పాఠప్రవచనములను చేస్తు ఎందరో విద్వాంసులను లోకానికి జ్ఞానదీపాలుగా తీర్చిదిద్దుతున్నారు.

ఇటువంటి మహనీయుల శుష్రూశ చేసి 2004 లో న్యాయవేదాంత విద్వాంసులై పరిణతిని పొంది ఉన్నవారే పండిత శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు, వీరి జన్మస్ధలము కర్ణాటకకు చెందిన నవ బృందావనము(రామాయణ కాలములో కిష్కందా క్షేత్రము) అను పవిత్రమైన తుంగభద్రా నది తీరము సమీపములో ఉండు గంగావతి అను ప్రాంతము. వీరిని లోకానికి కరుణించిన పుణ్య దంపతులు జన్మదాతలు కీర్తి శేషులు శ్రీ అరవిందాచార్య సుళిభావి (joint director andhrapradesh employment exchange,retired) మరియు రాధాబాయి. మా గురువులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్య సుళిభావి గారు కంప్యూటరు అంతర్జాలము (internet) లోకానికి పరిచయము అయ్యే సమయములో హైదరాబాదలో B.sc computer science చదువుచున్నారు కాని భగవంతుని సంకల్పానికి అనుగుణంగా శ్రీ అచార్యుల వారికి శ్రీ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి సహవాసము సాహచర్యము కలిగినది, ఒక జ్ఞాన పిపాసువుకి జ్ఞాన గంగకు సమాగమము వలె వీరిరువురి సమాగమము అయినది, అంతే సమగ్రమైన లౌకిక వ్యామొహాలను విడిచి వెంటనే శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వారు జ్ఞాన గంగని ఆస్వాదించడానికి శ్రీ శ్రీ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి పాదపద్మములను ఆశ్రయించగా సరస్వతీ కటాక్షముచే హరి వాయు గురువుల అనుగ్రహముచే అచిరకాలములోనె వేదాంతవిద్యని అభ్యసించి విద్వాంసుల పరీక్షలో శహభాష అనిపించుకున్న శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులవారిని సనాతన ధర్మ ప్రచారము కొరకై పరమ విష్ణు క్షేత్రమైన శ్రీ గయ విష్ణు పాద సన్నిధానమునకు శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదులవారు పంపించగా అచట ఆ పుణ్య క్షేత్రములో నిత్యము విష్ణు పాదమునకు కైంకర్యములను చేస్తు ప్రతి రోజు శ్రీ మద్ భాగవతమును మన రాష్ట్ర భాష అయిన హిందీలో ఉపన్యసించు చుండేవారు.

అలా ఆచార్యుల వారి జ్ఞాన పయనము సాగుతుండగా వీరి విద్యా గురువులైన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదులవారు 2007లో ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి జ్ఞానోపదేశమును చేయుటకు రాగా ఇచటి భగవత్భక్తులు భగవంతుని జ్ఞాన పిపాసతో బాధపడుతుండగా, ఆ భక్తుల ప్రార్థనను స్వీకరించిన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదులవారు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులని తేట తెలుగు భాషలొ ధర్మప్రచారము చేయవలసినదిగా ఆదేశించి మన తెలుగు వారికి మహోపకారమును చేసినారు, శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదులవారి ఆదేశాన్ని శిరసావహించిన శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులవారు గుంటూరు ప్రాంతాన్ని కేంద్రముగా చేసుకొని ఇచటనే ఉంటు సమగ్రమైన ఆంధ్రప్రదేశ రాష్ట్రములో పల్లే పల్లేకు వెళ్ళి ధర్మ ప్రచారమును చేయుచున్నారు. అంతే కాకుండా తమ computer knowledge ద్వారా facebook, blogspot మరియు గ్రంధరచనముల మూలకంగా భగవమతుని జ్ఞానాన్ని లోకానికి అందజేస్తున్నారు.

ప్రతినిత్యము సాలగ్రామముల పూజ , వైశ్వదేవాది హోమములను, మహామంత్రజపములను సిద్ధి చేసుకొనుచు, శ్రీ మన్ మధ్వాచార్యుల వారి గ్రంథములను, ఉపనిషత్తులను, భాగవతాది పురాణములను శిష్యకోటికి ఉపదేశిస్తు నిరంతరము భగంతుని ఆరాధనమును చేస్తు తమ జన్మని సార్థకమును చేసుకొనుచున్నారు.

ఇది ఇలా ఉండగా ఎవరూ భగవంతుని జ్ఞానానికి వంచితులు కాగూడదు అను ఆచార్యులవారి మహొన్నత మైన సంకల్పానికి తమవంతు సేవగా వీరి శిష్య పరమాణువులు కొందరు భగవద్భక్తులము, నేటి అంతర్జాలము ద్వారా (internet web site) ఆచార్యులవారి ఉపన్యాసములను లోకానికి అందజెయ్యాలి అని ఆచార్యులవారి ఆజ్ఞతో www.narasimhacharyasulibhavi.org అను websiteను ప్రారంభముచేయుచున్నాము. ఈ అంతర్జాలము ఎందు ఆచార్యుల వారు ఇప్పటివరకు చెప్పిన భాగవత, మహాభారతాది ప్రవచనములను పెట్టి ఇక ముందు జరిగే ఆచార్యుల వారి ఉపన్యాసములను కూడా upload చేయుచున్నాము, కావున ఈ అపురూపమైన అవకాశమును సజ్జన లోకము సద్వినియొగము చేసు కొనెదరని ఆశిస్తు , ఆచార్యుల శిష్యగణము హరివాయుగురువుల సేవకులు కృషి మొదలగువారు.

4 thoughts on “పరిచయం

  1. KOPALLI VENKATA RAMA ANANTHA SESHAGIRIRAO

    It is a great privilege for all of us to listen to the excellent exposition of the Epics like Sri Madbhagavatha Harikathaamruthe sara,and others in Telugu and at our convenience.

    K.V.R.A.SESHAGIRIRAO KAKINADA

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>