51) సాత్వికాది విభాగమతో అష్టాదశ పురాణములు.
మన భారతీ సంస్కృతికి అద్దం పట్టేవి మనవే అయిన అష్టాదశ పురాణములు. ఇవన్ని భగవాన శ్రీ వేదవ్యాసుల వారే రచించినారు ఇందులో ఎట్టి వివాదము లేదు. అయినప్పటికి ఒక పురాణములో ఉన్నాదానికి తద్విరుద్ధముగా వెరొక పురాణములో ఉంటుంది. ఉదాహరణకు శ్రీ మద్ భాగవతాదులు శ్రీ మహావిష్ణువు సర్వోత్తముడని ఘోషించగా స్కాందాది పురాణములు వెరొకరిని సర్వోత్తములు అని తెలియజేయుచున్నావి. ఇలా ఉండగా శ్రీ మద్ భాగవతాదులను అనుసరించి శ్రీ మహావిష్ణువే సర్వోత్తముడని మనము తెలుసుకోవాలా లేదా ఇరప పురాణములలో ఉన్నట్టు ఇతర దేవతలను సర్వోత్తములు అని తెలుసుకోవాలా ? అనే సందేహము మనకు కలుగుట సహజమే.ఇట్టి సందేహమును పురాణపురుషుడైన, పురాణకర్తా అయిన శ్రీ వేదవ్యాసులవారే తీర్చిఉన్నారు.
యద్యపి అష్టాధశ పురాణములను భగవాన్ శ్రీ వేదవ్యాసులవారే రచించినా, ఆయనే ఆ పురాణాలలో సాత్విక, రాజసిక మరియు తామసిక అను ౩ ప్రభేదములతో విభాగము చేసిఉన్నారు. ఇట్టి విభాగము యొక్క ఉద్ధేష్యము ఏమనగా, భగవంతుని యథార్థమైన తత్వజ్ఞానమునకు అందరూ అర్హులు కారు, అర్హత లేని రాజసిక మరియు తామసిక జీవులు ఇట్టి మోక్షదాయకమైన భగవంతుడగు శ్రీ మహావిష్ణువుని యథార్థ జ్ఞానమును పొందకూడదు అను ఉద్దేష్యముతో, తత్వజ్ఞాన మార్గములో దారితప్పవలెననెడి సంకల్పముతో ఈ పురాణ విభాగమును శ్రీ వేదవ్యాసులవారే స్వయముగా గావించారు.
సాత్వికులు సాత్విక వపరాణములను తెలిసుకొని మోక్షాది సర్వ పురుషార్థములు పొందవలెనని, రాజసికుల రాజసిక పురాణములో తెలుపబడిన యథార్థ అయథార్థ మిస్రములగు జ్ఞానమును పొంది నిత్య సుఖ దుఃఖ మిశ్రిత ఫలములు పొందవలెనని, తామసికులు తామసిక పురాణములనే యథార్థమని నమ్మి నిత్యనరకము పొందవలెననియే ఈ త్రివిధ పురాణ విభాగము గావించియున్నారు.
త్రివిధ పురాణముల విభాగము-
సాత్వికాది పురాణములు- (పద్మపురాణ వచనము)
శ్రుణుదేవి ప్రవక్ష్యామి తామసాని యథాక్రమాత్ |
యేషాం శ్రవణమాత్రేణ పాతిత్యం జ్ఞానినామపి ||
మాత్స్యం కౌర్మం తథా లైంగం శైవం స్కాందం తథైవ చ |
ఆగ్నేయం తు షడేతాని తామసాని నిబోధ మే ||
భావం- మాత్స్య, కూర్మ లింగ, శివ, స్కాంద, ఆగ్నేయ మొదలగు ఆరు పురాణము తామసికపురాణములు, వీట్ని విన్నమాత్రమున జ్ఞాని అయినవాడు పతితుడు కాగలడు.
వైష్ణవం నారదీయం తు తథా భాగవతం శుభం |
గారుడం చ తథా పాద్మం వారాహం శుభదర్శనే |
సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై ||
భావం- విష్ణుపురాణము, నారద, భాగవత, గరుడ, పద్మ, వరాహ పురాణములు సాత్విక పురాణములు, వీటి అధ్యయనముతో మోక్షాది సర్వపురుషార్థములు కలుగును.
బ్రహ్మాడం బ్రహ్మవైవర్తం మార్కండేయం తథైవ చ |
భవిష్యద్వామనం బ్రాహ్మం రాజసాని నిబోధ మే |
సాత్వికా మోక్షదాః ప్రోక్తా రాజసా స్స్వర్గదాశ్శుభాః |
తథైవ తామసా దేవి నిరయ ప్రాప్తి హేతవః ||
భావం- బ్రహ్మాండ, బ్రహ్మవైవర్తము, మార్కండేయము, భవిష్యపురాణము, వామన, బ్రహ్మ ఇవి అరు రాజసిక పురాణములు అని తెలుప బడినవి ఇవి స్వర్గమును మాత్రము కలుగజేయును.
కాని ఒక ముఖ్యమైన విషయము ఏమనగా. ఏ పురాణము అయిననూ విష్ణుసర్వోత్తమత్వము మొదలగు విషయములను తెలుపునట్టి సాత్విక పురాణములకు విరోధము కానట్టి విషయములైతే వాటిని స్వీకరించాలి, విరోధి విషయము అయినచో త్యజించాలి.