శ్రాద్ధములో పూజింపబడే పితృదేవతలు అనగా ఎవరు?
ఈ సందేహము పాండవ జ్యేష్ఠుడైన యుధిష్ఠురిడికి ( అనగా శ్రాద్ధదేవ అను పేరు ఉన్న యమధర్మరాజుగారి అవతారము) కలగగా ఈ సందేహమును నివృత్తి చెసినవారుభీష్మాచార్యులు. అంటే యుధిష్ఠురిడికి తెలియదు అని కాదు కాని మనకు తెలియజేయాలని ఆ మహనీయుడి అభిప్రాయము. అట్టి గహనమైన విషయము మనము అందరము తెలిసుకొనవలసినదే.
యుధిష్ఠిరుడి సందేహము ఏమనగా! ప్రతీ జీవి తను చేసిన కర్మముల ప్రతిఫలమును అనుభవించుటకు స్వర్గమో, నరకమో మరి వేరె ఏదైనా లోకమునకు ఏగినప్పుడు, అచటనే ఉండు అనివార్య పరిస్ధితులను దాటుకొని ఇచట కర్మభూమి అయిన మన భారతముదేశములో వారి వారి సంతానము జేయు శ్రాద్ధమును స్వీకరించుటకు రావడము ఎలా సాధ్యము?కొన్ని జీవులు నరక లోకములో నుండగా ఇచటకు రావడము వారికి ఇంకను అసాధ్యము, మరి కొన్ని జీవులు కర్మవశమున క్రూరమృగాలుగా, లేదా మరియొక పశుయోనిలో నుండగా మనము మన ఇళ్ళలోనో, దైవసన్నీధానముతో పవిత్రమైన మఠములలోనో లేదా దేవాలయాలలోనో శ్రాద్ధము చేయగా అచట మన పితృవులు వచ్చి ఆశీర్వాదము చేయుటకు ఎలా సాధ్యము?
ఇట్టి సందేహము వెనక స్వయముగా భీష్మాచార్యులకును కలుగగా సంక్షిప్తముగా వారి జన్మదాతలైన శంతను మహారాజుగారు పరిహరించిరి.
ఈ సందేహపరిహారము ఏమనగా, శ్రాద్ధమునకు వచ్చి మనులను ఆశీర్వదించు మన జన్నదాతలు ఎవరో, వారే స్వయముగా రారు, కాని, మన జన్మదాతల రూపములను ధరించి మనకు ఆశీర్వదించి వెళ్ళువారు చతుర్ముఖ బ్రహ్మ దేవుని కుమారులైన పితృగణదేవతలు, వీరి లోకము స్వర్గముకన్ననూ ఊర్ధ్వ లోకములలో అనగా సోమలోకములో నుండును,మనము శ్రాద్ధవిధితో వీరిని తృప్తి పరచగా వీరు, కర్మవశమున ఏ లోకములోనైనూ, ఏ అవస్థలోనున్ననూ మన జన్మదాతలైన మాతా పితృువులను త్రప్తి పరుచురు, శ్రాద్ధవిధి ఎందు మన శ్రద్ధని చూసి సర్వలోకములనే తృప్తి పరుచువారు.
ఇట్టి ఈ పితృగణదేవతల ఏడు ప్రకారాలుగా శాస్త్రములో వర్ణించబడినది,
-
విరాజ ప్రజాపతిగారి కుమారులు వైరాజ పితృగణము, దేవతలు వీరిని విశేషముగా పూజించురు.
-
మరీచి ప్రజాపతులవారి కుమారులు ఆగ్నీష్వాత్తా పితృగణము, వీరూ దేవతలచే పూజింపబడువారు.
-
ప్రజాపతి పులస్త్యులవారి కుమారులు బర్హిషద అను పేరు కలిగిన పితృగణము, వీరిని దేవతలు, యక్ష గంధర్వ రాక్షసులు, నాగములు,సర్పములు, గరుడుడు మొదలగు పక్షిశ్రేష్ఠులు పూజించురు.
-
వశిష్ఠ ప్రజాపతుల కుమారులు సుకాలా నామకులగు పితృగణము, వీరిని బ్రాహ్మణులు ఆరాధించురు.
-
అంగీరస ప్రజాపతుల కుమారులు ఆంగీరస పితృగణము, వీరిని క్షత్రయులు ఉపాసన చేయుదురు.
-
పులహ నామము కలిగిన ప్రజాపతుల వారి కుమారులు సుస్వధా నామకులైన పితృగణము, వారిని వైశ్యజాతికి చెందినవారు పూజింతురు.
అగ్ని ప్రజాపతి (అగ్నిదేవుడు) గారి కుమారులు సోమపా పితృగణము, వీరిని శూద్రులు పూజించురు.
ఈ సప్త సంఖ్యలో ఉన్న పితృగణ దేవతలకు సంభంధించిన ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని విస్తారముగా నా అంతర్జాలములో (website,narasimhacharyasulibh
సశేషము…
అస్మత్ పితృంతర్గత శ్రీ భారతీ రమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీ జనార్దన ప్రీయతామ్ ప్రీతోవరదో భవతు.
శ్రీ కృష్మార్పణమస్తు.
SRI 1008 SRI SATYATMA TIRTHA DASA
NARASIMHACHARYA SULIBHAVI,